నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 50 మంది మించి జనం ఒక దగ్గర గుమ్మికూడరాదు అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మతపరమైన, సామాజిక, సాంస్కృతిక సమావేశాల్లో 50 మందిని మించి జనసమీకరణ ఉండ కూడదన్నారు. అయితే పెళ్లిలకు ఈ నియమం వర్తించదన్నారు. క్వారెంటైన్ కోసం మూడు హోటళ్లను గుర్తించినట్లు చెప్పారు. డబ్బులు కట్టి ఎవరైనా ఆ హోటళ్లలో ఐసోలేట్ కావచ్చు అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీ తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఏడు కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో ఇద్దరికి వ్యాధి నయమైంది. ఒకరు మరణించారు. దేశంలో కోవిడ్19 కేసులు 110కి చేరుకున్నాయి. ఆ జాబితాలో విదేశీయులు కూడా ఉన్నారు.