అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో 38,77,717 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, పింఛన్లకోసం ప్రతినెలా రూ.879 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు చల్లా ధర్మారెడ్డి, కాలె యాదయ్య, కే చందర్ అడిగిన ప్రశ్నకు ఎర్రబెల్లి సమాధానమిచ్చారు. ఈ నెల తర్వాత వృద్ధాప్య పింఛ న్ వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తామని తెలిపారు. దీనివల్ల మరో 6.62 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారన్నారు.
ప్రతినెలా పింఛన్లకు రూ.879 కోట్లు