సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నాలుగేళ్ల బుడతడు విరాళం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి నాలుగేళ్ల బుడతడు విరాళం ఇచ్చాడు. హేమంత్‌(4) సైకిల్‌ కొనుకుందామని డబ్బును దాచి పెట్టుకుంటున్నాడు. కానీ కరోనా ప్రబలుతున్న పరిస్థితులను చూసి ఆ బుడ్డోడి మనసు చలించింది. తాను దాచుకున్న రూ. 971లను సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళంగా ఇచ్చాడు. ఆ నగదును విజయవాడలో ఏపీ మంత్రి పేర్ని వెంకటరామయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా హేమంత్‌ను మంత్రి అభినందించారు.